డోర్ టు డోర్ సేవలు ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ

  • ఇప్పటికే సరకు రవాణా సేవలు అందిస్తున్న ఆర్టీసీ
  • ఇకపై ఇంటి వద్దకే కార్గో సేవలు
  • డోర్ టు డోర్ సేవలు ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూప్
  • వివరాలు తెలిపిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
గత కొన్నాళ్లుగా కార్గో సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ తాజాగా డోర్ టు డోర్ సేవలు ప్రారంభించింది. ఆర్టీసీ కార్గోలో డోర్ టు డోర్ సేవలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో సర్వీసుకు ఆదరణ పెరిగిందని అన్నారు. రేపు అర్ధరాత్రి నుంచి డోర్ టు డోర్ కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తొలి మూడు ఆర్డర్లకు కార్గో పికప్, డెలివరీ సేవలు ఉచితం అని వెల్లడించారు. 

తొలుత విజయవాడ-విశాఖ మధ్య ఉగాది నుంచి సేవలు అమల్లోకి వస్తాయని, ఆపై దశల వారీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి విస్తరిస్తామని వివరించారు. ఆన్ లైన్ లేదా, యాప్ ద్వారా కార్గో సేవలు పొందవచ్చని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.


More Telugu News