అసెంబ్లీ దాడి ఘటనపై తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- అసెంబ్లీలో తమపై దాడి జరిగిందన్న టీడీపీ ఎమ్మెల్యేలు
- వెల్లంపల్లి, కారుమూరి, సుధాకర్ బాబు, ఎలీజాపై ఫిర్యాదు
- అసెంబ్లీ ఘటనపై విచారణ జరపాలని పోలీసులకు విజ్ఞప్తి
- వీడియో ఫుటేజి పరిశీలించాలని వినతి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు జీవో నెం.1పై చర్చకు పట్టుబట్టగా, తదనంతరం దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి... బాలవీరాంజనేయస్వామిపై సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలవీరాంజనేయస్వామి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుధాకర్ బాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎలీజాపై ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ వీడియో ఫుటేజి పరిశీలించాలని పోలీసులకు సూచించారు.