హీరోయిన్ కార్తీకకు అరుదైన గౌరవాన్ని ఇచ్చిన యూఏఈ
- దుబాయ్ లో సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న కార్తీక
- వ్యాపార విస్తరణలో ఆమె సేవలకు గాను గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ
- ఈ గుర్తింపును పొందడం ఎంతో గర్వంగా ఉందన్న కార్తీక
సీనియర్ సినీ నటి రాధ కుమార్తె కార్తీకకు యూఏఈ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. కార్తీకకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. దుబాయ్ లోని ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొన్నేళ్లుగా అక్కడ వ్యాపార కార్యకలాపాలను అభివృద్ధి చేయడంలో కార్తీక కీలక పాత్రను పోషిస్తోంది. కొన్నేళ్లుగా అక్కడే స్థిరపడి యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా గుర్తింపు పొందింది. ఆమె చేస్తున్న సేవలకు గాను ఆమెకు గోల్డెన్ వీసాను ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్తీక స్పందిస్తూ... ఈ గుర్తింపును పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని అన్నారు. మరోవైపు కార్తీక తల్లి రాధకు కూడా గతంలో యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ఇచ్చి సత్కరించింది. నటిగా సినీ రంగానికి చేసిన సేవలకు గాను రాధకు గోల్డెన్ వీసాను ఇచ్చింది.