జగన్ సిగ్గుపడాలి: నక్కా ఆనందబాబు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లోకి వెళ్లారన్న ఆనందబాబు
- దళిత ఎమ్మెల్యేలపై జగన్ కక్ష పెంచుకున్నారని వ్యాఖ్య
- దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి చేయడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలుచుకునే సరికి వైసీపీ నేతలు పూర్తిగా ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోయారని అన్నారు. తమ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో ముఖ్యమంత్రి జగన్ దాడి చేయించారని... దీనికి జగన్ సిగ్గుపడాలని అన్నారు. దళిత ఎమ్మెల్యేలపై జగన్ కక్ష పెంచుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని... అందుకే సహనాన్ని కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. దాడి చేసిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. గతంలో కూడా బాల వీరాంజనేయస్వామి గురించి మంత్రి మేరుగ నాగార్జున నీచంగా మాట్లాడారని అన్నారు.
జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా వీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారు. ఆయన తోసి వేయగా వీరాంజనేయస్వామి స్పీకర్ పోడియం మెట్ల వద్ద కింద పడిపోయారు. మరోవైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గరున్న ప్లకార్డును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాక్కుని పడేశారు.