వైసీపీ నేతల ట్విట్టర్ అకౌంట్లకు.. ‘బ్లాక్ డే’ డీపీలు!
- ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత
- టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం
- తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ రెండు పార్టీల ఆరోపణలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిపటికే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం తలపించింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుండగా.. దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చారు. ‘బ్లాక్ డే’ అని ఉన్న ఫొటో పెట్టారు. ‘అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్ సీపీ దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై దాడి చేసిన టీడీపీ నేతలు’ అని పేర్కొన్నారు. మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, తదితరులు కూడా ఇదే డీపీని పెట్టడం గమనార్హం.