శాకుంతలంలో అప్సర మేనకగా మధుబాల.. అదిపోయిన లుక్

  • ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
  • సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన  సినిమా
  • ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
సమంత కథానాయికగా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. ప్రస్తుత తరంలో ఇలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. కాళిదాసు రాసిన సంస్కృత‌ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఎన్నో అంచనాలున్న ఈ సినిమాలో  శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ నటించారు. దుర్వాస మహర్షి పాత్రలో మోహన్ బాబు, అనసూయగా అనన్య నాగళ్ల, ప్రియంవదగా అదితి బాలన్, ఇంద్రుడిగా జిషుసేన్ గుప్తా నటించారు. 

ఈ మేరకు వారి ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్ర బృందం  ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఈ చిత్రంలో మధుబాల క్యారెక్టర్ ను పరిచయం చేశారు. శాకుంతలంలో ఆమె ‘అప్సర మేనక’గా కనిపించనుంది. మేనకను తలపించేలా పాల వర్ణంలోని చీర, వజ్రాలతో పొదిగిన కిరీటం,నగలు ధరించిన ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. తెలుగుతో పాటుగా  త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు.


More Telugu News