స్టీవ్ స్మిత్ ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ’.. ఇదిగో వీడియో!
- టీమిండియా, ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్
- గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని అందుకున్న ఆసీస్ కెప్టెన్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూకట్టడంతో 117 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ ‘వహ్!’ అనేలా ఉంది.
గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అందుకున్న క్యాచ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యాకు సీన్ అబాట్ బౌలింగ్ చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం టీమిండియా వంతు అయింది. కామెంట్రీ బాక్స్ లో ఉన్న సంజయ్ మంజ్రేకర్.. ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ’గా దీన్ని పరిగణించవచ్చంటూ వ్యాఖ్యానించాడు.
ఆదివారం విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో 26 ఓవర్లు అతి కష్టం మీద ఆడిన టీమిండియా.. 117 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీశాడు. సీన్ అబాట్ 3, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. వికెట్ కోల్పోకుండానే 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి ఘన విజయాన్నిఅందుకుంది. సిరీస్ ను 1-1తో సమం చేసింది. చివరి వన్డే వచ్చే బుధవారం జరగనుంది.