పాట్నా రైల్వే స్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియో ప్రసారం
- పాట్నా రైల్వే స్టేషన్‌లో ఆదివారం వెలుగు చూసిన ఘటన
- మూడు నిమిషాలపాటు టీవీలో ప్రసారమైన పోర్న్ వీడియో
- ఇబ్బంది పడ్డ ప్రయాణికులు..రైల్వే పోలీసులకు ఫిర్యాదు
- టీవీలను ఏర్పాటు చేసిన సంస్థతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న రైల్వే
బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ఆదివారం ‘పోర్న్’ కలకలం రేగింది. ఉదయం 9.30 గంటల సమయంలో స్టేషన్‌లో అమర్చిన పలు టీవీ స్క్రీన్లపై ఒక్కసారిగా పోర్న్ దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఏకంగా మూడు నిమిషాల పాటు స్క్రీన్లపై పోర్న్ వీడియో ప్లే అయింది. దీంతో.. స్టేషన్‌లోని వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొందరు తక్షణం గవర్న్‌మెంట్ రైల్వే పోలీసులకు(జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు(ఆర్‌పీఎఫ్) ఫిర్యాదు చేశారు.
అయితే.. జీఆర్‌పీ పోలీసులు చర్యలు తీసుకోవడంలో కాస్తంత జాప్యం కావడంతో ఆర్‌పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వే స్టేషన్‌లో టీవీలు అమర్చిన కాంట్రాక్ట్ సంస్థ దత్తా కమ్యూనికేషన్స్‌కు సమాచారం అందించారు. తక్షణం పోర్న్ వీడియో ప్రసారం నిలిపివేయాలని ఆదేశించారు. రైల్వే అధికారులు ఆ సంస్థపై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. దత్తా కమ్యూనికేషన్స్‌ను రైల్వే శాఖ బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటూ జరిమానా కూడా విధించింది. ఆ సంస్థతో కాంట్రాక్ట్‌ను రైల్వే శాఖ రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఘటనపై రైల్వే శాఖ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫాంలోని టీవీల్లోనే ఈ వీడియో కనిపించడంపైనా అధికారులు దృష్టి సారించారు.