అంగన్ వాడీల ‘ఛలో విజయవాడ’ ఉద్రిక్తం

  • ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
  • ముందస్తు అరెస్టులు, పలువురికి నోటీసులు
  • మద్దతు తెలిపిన టీడీపీ నేతల గృహనిర్బంధం
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలువురు అంగన్ వాడీ యూనియన్ లీడర్లను, కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేలాది మందిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇంకొంతమందిని ముందస్తుగా అరెస్టు చేసినట్లు సమాచారం.

ఛలో విజయవాడ ఆందోళన నేపథ్యంలో అంగన్ వాడీల యూనియన్ లీడర్లు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ లీడర్లను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీలపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరును పలువురు తప్పుబడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం తప్ప అంగన్ వాడీలు చేసిన నేరమేంటని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.


More Telugu News