తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- ఉపరితల ద్రోణీ కొనసాగుతుందని ప్రకటన
- ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
వేసవిలో అకాల వర్షాలతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున మరికొన్ని రోజులు వర్షాలు తప్పవని వెల్లడించింది. కర్ణాటక, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఈ ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉందని చెప్పింది. కాగా, ఆదివారం అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మి.మీ. వర్షపాతం నమోదైంది.