కేంద్ర పథకాల లబ్ధిదారులైన కోటిమంది మహిళలతో సెల్ఫీ: యామినీ శర్మ
- కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందన్న యామినీ శర్మ
- మోదీ యాప్‌లో సెల్ఫీల అప్‌లోడ్
- గ్రామీణ మహిళల నుంచి మహిళా వ్యాపారవేత్తల వరకు సెల్ఫీ కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన కోటిమందితో కలిసి సెల్ఫీ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నట్టు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ సాధినేని యామినీశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గృహిణుల నుంచి మహిళా వ్యాపారవేత్తల వరకు ఉంటారని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందే బాలింతలు, గర్భిణులు, అలాగే ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, జల్‌జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, సౌభాగ్య యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో కోటిమందికిపైగా లబ్ధిపొందుతున్నట్టు యామినీ శర్మ తెలిపారు. వీరందరితో సెల్ఫీ తీసుకుని మోదీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వ ముసుగు ఈ కార్యక్రమంతో తొలగిపోతుందని యామినీ శర్మ అన్నారు.