దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఒక్క రోజే 1000కి పైగా నమోదు
- గత 24 గంటల్లో 1,071 కేసులు
- 5,915కు పెరిగిన క్రియాశీల కేసులు
- రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి మృతి
- ఝార్కండ్‌లో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 129 రోజుల తర్వాత నిన్న ఒక్క రోజే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,915కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిన్న ఈ విషయాన్ని వెల్లడించింది.
గత 24 గంటల్లో 1,071 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో కరోనా బారినపడి ఒక్కొక్కరు మరణించినట్టు పేర్కొంది. వీరితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,802కు పెరిగినట్టు వివరించింది. ఇక, ఝార్ఖండ్‌లో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా, ఐదు కరోనా కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.