ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్నారు... ఇప్పుడు తూచ్ అంటున్నారు: లోకేశ్​

  • కదిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 600 కిమీ మార్కు చేరుకున్న యువగళం
  • చిన్నయల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ హామీ ఇచ్చిన లోకేశ్
  • యువగళం దెబ్బకు జగన్ కు మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 47వ రోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మార్కును చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న ఆనందంతో కేరింతలు కొట్టారు. 

పాద‌యాత్ర 600 కి.మీ చేరుకున్న సంద‌ర్భంగా చిన్నయ‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా కటారుపల్లె వద్ద వేమన సమాధి, గొటిబాయిలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను, చెర్లోపల్లి రిజర్వాయర్ బోటింగ్, బట్రేపల్లె వాటర్ ఫాల్స్ , శ్రీ ఖాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 

సాయంత్రం జొన్నపేటలో జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు.

లోకేశ్ మాటల తూటాలు...

  • అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్... ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజావిజయం.
  • యువగళం దెబ్బకు జగన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది.
  • ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా 2024లో చూపిస్తాం.
  • రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.
  • ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు... ఫలితాలు వచ్చాక తూచ్ అనడం హాస్యాస్పదంగా ఉంది.
  • గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవికి పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లను వైసీపీ నిలబెట్టింది. 108 నియోజకవర్గాల యువత వైసీపీని ఛీ కొట్టారు.
  • అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన దాఖలాలు చరిత్రలో మనం చూడలేదు... కానీ వైసీపీ ఆరోపించింది. 
  • వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి... బైబై జగన్ అంటూ యువత తీర్పునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు.
  • ఎన్నిచేసినా ప్రజలు భారీ మెజారిటీతో టీడీపీకి అనుకూలంగా తీర్పుచెప్పారు. 
  • 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పనికిమాలిన సీఎం జగన్. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఒకటే స్లోగన్, సైకోపోవాలి...సైకిల్ రావాలి. 
  • ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని జగన్ దుర్వినియోగం చేశాడు. ఏపీ రాజధానితో  మూడు ముక్కలాట ఆడిన జగన్ కు మూడు మొట్టికాయలతో బుద్ధిచెప్పారు.
  • మైండ్ ఉన్న వాడు ఎవడైనా సింగపూర్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటాడు. మన సీఎం మాత్రం ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన ప్రారంభిస్తారు. సైకో సీఎం ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు.
  • సీఎం అయిన తరువాత ఎవరైనా మొదట చేసే పని పరిశ్రమలు తీసుకురావడం. కానీ ఫెయిల్డ్ సీఎం కథ వేరు... ఈయన సీఎం అయిన వెంటనే పీపీఏ లు రద్దు చేసి ఉన్న కంపెనీలను తరిమేసాడు.
  •  సీఎం అయ్యాక ఎవరైనా అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడతారు. మన ఫెయిల్డ్ సీఎం జగన్ మాత్రం కేవలం ప్రతిపక్షంపై కక్ష సాధింపు ఎజెండాగా పెట్టుకున్నాడు.
  • జగన్ రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రెండుసార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియాకి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 
  • 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు. 
  • కియా కారు చూస్తే అనంతపురం గుర్తుకు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తుకు వస్తారు. 
  • జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురంకి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా? 
  • మహిళల్ని మోసపూరిత హామీలిచ్చి ముంచేశాడు ఫెయిల్డ్ సీఎం జగన్. ఉద్యోగస్తులకు వారంలో పెన్షన్ రద్దు అన్నాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నాడు. ఫెయిల్డ్ సీఎం జగన్ ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి. 
  • కదిరి ఎమ్మెల్యే గారి పేరు సిద్ధారెడ్డి. ఆయన ప్రజల సొమ్ము కొట్టేయడంలో సిద్దహస్తుడు. 
  • నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 50 వేల రూపాయలకు మించి ఏ కాంట్రాక్ట్ అయినా సరే సిద్ధారెడ్డి కంపెనీకే పనులు దక్కుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు మొత్తం సిద్ధారెడ్డికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు. 
  • రోడ్డు వేయలేని వాడు కాంట్రాక్టు ఎందుకు తీసుకోవాలి? జనాల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. గ్రామాల్లో రోడ్లు వేయని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరిలో తన అపార్ట్ మెంట్ కు మాత్రం 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకున్నారు. 
  • ఖాద్రీ నరసింహుడు కోనేరులోకి మురుగునీరు రాకుండా ఉండటం కోసం రూ.2 కోట్ల 30 లక్షలతో మోడర్నైజేషన్ పనులు అనంతపురానికి చెందిన కంపెనీకి అప్పగించి ఎమ్మెల్యే రూ.2 కోట్లు కొట్టేశాడు.

======

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 602.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 11.7 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 48వ రోజు షెడ్యూల్ (20-3-2023)*

*కదిరి నియోజకవర్గం (శ్రీ సత్యసాయి జిల్లా).*

ఉదయం

8.00 – జోగన్నపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – మోటుకుపల్లి వద్ద అనాధలతో మాటామంతీ.

10.20 – మోటుకుపల్లి పీవీఆర్ గ్రౌండ్ లో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

11.20 – మోటుకుపల్లిలో భోజన విరామం.

మధ్యాహ్నం

2.20 – మోటుకుపల్లి భోజన విరామస్థలంలో ముస్లింలతో ముఖాముఖి.

సాయంత్రం

4.20 – కదిరి ఇక్బాల్ సర్కిల్ (జీవమాను సర్కల్) లో స్థానికులతో మాటామంతీ.

4.45 – కదిరి ఎంజీ రోడ్డులో జ్యుయలరీ షాపు యజమానులతో భేటీ.

5.00 – కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు.

7.10 – కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రంలో బస.


=====



More Telugu News