ఓటీటీలో విడుదలైన ఆ వెబ్ సిరీస్‌పై విజయశాంతి ఫైర్

  • ‘ఇటీవల ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్’ అంటూ విమర్శలు
  • ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలన్న విజయశాంతి
  • వెంటనే అలాంటి సీన్లను తొలగించాలని డిమాండ్
  • ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని సూచన
ఇటీవల విడుదలైన ఓ వెబ్ సిరీస్‌పై నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ఆ వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకుండా.. ‘ఇటీవల విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్‌పై’ అంటూ విమర్శలు గుప్పించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలని సూచించారు. 

ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాల్లోని అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని నటులు, నిర్మాతలను విజయశాంతి కోరారు. మహిళా వ్యతిరేకతతో ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని, ప్రేక్షకుల అభిమానాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయశాంతితో తాము ఏకీభవిస్తున్నట్టు చెబుతూ పోస్టులు చేస్తున్నారు.


More Telugu News