పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలవడంపై చంద్రబాబు స్పందన
- ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్
- మూడింటికి మూడు స్థానాల్లో సైకిల్ జోరు
- ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు
- ప్రజలకు అండగా నిలవాలని ముగ్గురు విజేతలకు పిలుపు
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం, మార్పునకు సంకేతం. మంచికి మార్గం... రాష్ట్రానికి శుభసూచకం" అని అభివర్ణించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.