జగన్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఉంది: రోజా
- ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఎంతో మంది పారిశ్రామికవేత్తలను జగన్ రప్పించారన్న రోజా
- జగన్ పై నమ్మకంతో వారంతా తరలి వచ్చారని వ్యాఖ్య
- జగన్ ఒక ట్రెండ్ సెట్టర్ అని కితాబు
విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమయిందని మంత్రి రోజా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సుకు ఇంత మంది పారిశ్రామికవేత్తలు రాలేదని... కానీ 44 నెలల పాలనలో తన నాయకత్వంతో ఇంతమంది పారిశ్రామికవేత్తలను జగన్ రప్పించారని చెప్పారు. జగన్ కు దేశ వ్యాప్తంగా ఎంత ఇమేజ్ ఉందో దీని వల్ల అర్థమవుతుందని అన్నారు. జగన్ ట్రెండ్ సెట్టర్ అని... ఆయన ఏది చేసినా ట్రెండ్ అవుతుందని చెప్పారు.
పరిశ్రమలు తరలిపోతున్నాయని, పెట్టుబడులు రావడం లేదని టీడీపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాలను ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో తిప్పికొట్టామని అన్నారు. జగన్ పై నమ్మకంతో ఇన్వెస్టర్లు రాష్ట్రానికి తరలి వచ్చారని చెప్పారు. దారినపోయే వారితో ఎంఓయూలు చేయించారని ఒక నాయకుడు అన్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ముకేశ్ అంబానీ, జిందాల్, కరణ్ అదానీ, దాల్మియా వంటివాళ్లని దారినపోయేవాళ్లు అన్నారంటే ఆ మనిషికి లోకజ్ఞానం ఉందా? అనే సందేహం కలుగుతోందని చెప్పారు.