అల్లరి నరేశ్ ను కొత్తగా చూపిస్తున్న 'ఉగ్రం' .. మెలోడీ సాంగ్ ప్రోమో రిలీజ్!
- అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'ఉగ్రం'
- విజయ్ కనకమేడలతో ఇది రెండో సినిమా
- కథానాయికగా మిర్నా పరిచయం
- సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల
హాస్య కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లరి నరేశ్, ఈ మధ్య విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అలా విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఆయన చేసిన 'నాంది' భారీ విజయాన్ని దక్కించుకుంది. అదే దర్శకుడితో ఆయన చేసిన తాజాగా చిత్రమే 'ఉగ్రం'.
ఈ సినిమా కూడా ఇంతవరకూ అల్లరి నరేశ్ కి ఉన్న క్రేజ్ కి భిన్నమైనదే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగు ప్రోమోను రిలీజ్ చేశారు. 'దేవేరి గుండెల్లో చేరి .. మదిలో మ్రోగిందే సరిగమ సావేరి' అంటూ ఈ పాట సాగుతోంది. నాయకా నాయికలపై చిత్రీకరించిన పూర్తి పాటను, రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాతో, కథానాయికగా 'మిర్నా' పరిచయం కానుంది. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అల్లరి నరేశ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.