చంద్రబాబు లేఖకు స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
- ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- విశాఖలో వైవీ సుబ్బారెడ్డి పర్యటన
- స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని అని ప్రశ్నించిన టీడీపీ
- సీఈవోకి లేఖ రాసిన చంద్రబాబు
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందించారు. ఈ వ్యవహారంలో ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. దాంతో, వైవీ సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు మరో లేఖ రాశారు.
ఏపీలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగ్గా, విశాఖలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైవీ సుబ్బారెడ్డి పర్యటించారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని? అని మండిపడ్డారు.