ఏపీలో వైసీపీ, బీజేపీ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది: విష్ణుకుమార్ రాజు
- ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించని బీజేపీ ప్రభావం
- వైసీపీతో బీజేపీ కలిసి పనిచేస్తోందని భావిస్తున్నారన్న విష్ణుకుమార్ రాజు
- వైసీపీతో ఉన్నామన్న ముద్ర తొలగించుకోవాల్సి ఉందని వెల్లడి
- ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలవాలని వ్యాఖ్యలు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళిపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోవడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.
ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, అందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం అని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. వైసీపీతో ఉన్నామన్న ముద్ర తొలగించుకోకపోతే బీజేపీకి మున్ముందు ఫలితాలు ఇంతకంటే తీవ్రంగా ఉంటాయని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలని, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతాలుగా భావించాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.