మా ఇద్దరి కెరీర్ ను రాజమౌళి చేతుల్లో పెట్టేశాం: రామ్ చరణ్
- చిరంజీవి, పవన్ తర్వాత ఎక్కువ గౌరవించేది రాజమౌళినే
అన్న చరణ్ - ఆయన కాబట్టే ఆర్ఆర్ఆర్ సాధ్యమైందని వెల్లడి
- ఇండియా టుడే కాంక్లేవ్ లో రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆస్కార్ అందుకున్న తొలి భారత చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డుకెక్కింది. ఆ క్రమంలో రాజమౌళిపైనా, సినిమా యూనిట్ పైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి అంటే తనకెంతో గౌరవం ఉందని హీరో రామ్ చరణ్ అంటున్నాడు. 14 ఏళ్ల క్రితం ‘మగధీర’తో తనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, టాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారని చెప్పాడు. పనిలో ఆయన మిస్టర్ పర్ ఫెక్ట్ అని కొనియాడారు. తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ తర్వాత తాను ఎక్కువగా గౌరవించే వ్యక్తి రాజమౌళి అన్నారు. ఇక, చిరంజీవి, పవన్ తనకు రెండు కళ్లలాంటి వారని చెప్పారు. ‘ఆస్కార్’ పురస్కార వేడుకల అనంతరం ఇండియాకు వచ్చిన రామ్ చరణ్ ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2023’ సెషన్‌లో పాల్గొన్నారు.
ఆ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్ సినిమా, ఆస్కార్ తదితర అంశాలతోపాటు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ కథ అనుకున్నప్పుడు రాజమౌళి తనను, తారక్‌ని ఎంచుకోవడానికి కారణం తామిద్దరి మధ్య ఉన్న స్నేహమే అన్నారు. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మ్యాచ్ అవుతుందని తామిద్దరినీ ఎంచుకున్నారని తెలిపారు. సినిమాల్లో నందమూరి, మెగా
ఫ్యాన్ పరంగా 35 ఏళ్ళుగా పోటీ నడుస్తోందని చరణ్ చెప్పారు. కానీ వ్యక్తిగతంగా ఇరు కుటుంబాల మధ్య అలాంటిది ఏమీ లేదన్నారు. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే తారక్, తన కాంబినేషన్ సెట్ అయ్యేది కాదన్నారు. తామూ అంత ఆసక్తి చూపించేవాళ్లం కాదేమో అన్నారు. రాజమౌళి కాబట్టే గుడ్డిగా ఇద్దరి కెరీర్‌ను ఆయన మీద పెట్టేశాం అని చరణ్ చెప్పుకొచ్చారు.