అమెరికాలోని 30 నగరాలతో ఒప్పందం చేసుకున్న నిత్యానంద కైలాస దేశం

  • సాంస్కృతిక భాగస్వామ్యం పేరుతో అమెరికా నగరాలతో ఒప్పందాలు
  • సిస్టర్ సిటీ పేరుతో ఒప్పందాలు 
  • ఒప్పందం రద్దు చేసుకున్న నెవార్క్ సిటీ
దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అడపా, దడపా కైలాస దేశం గురించి వార్తలు వచ్చినప్పటికీ... ఐక్యరాజ్యసమితితో ఆ దేశ ప్రతినిధులు కనిపించేసరికి అందరూ ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. అప్పటి నుంచి నిత్యానంద దేశం ప్రధాన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 'సాంస్కృతిక భాగస్వామ్యం' పేరుతో అమెరికాలో 30 నగరాలతో కైలాస దేశం ఒప్పందాలను కుదుర్చుకుంది. సిస్టర్ సిటీ పేరుతో ఈ ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే కైలాస దేశం అంటే ఏంటో కూడా తెలుసుకోకుండానే ఆ దేశాలు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. చివరకు దీన్ని గ్రహించిన నెవార్క్ సిటీ ఒప్పందం రద్దు చేసుకుంది. సిస్టర్ సిటీగా ఒప్పందం చేసుకోవాలంటే ఆ దేశానికి మానవ హక్కులకు సంబంధించి మంచి ప్రమాణాలు ఉండాలని తెలిపింది. కైలాస దేశంతో సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకున్నట్టు పలు నగరాలు ధ్రువీకరించాయి.


More Telugu News