జిమ్‌కు వెళ్లొచ్చి.. గుండెపోటుతో యువకుడి మృతి
- మహబూబ్‌నగర్‌లో ఘటన
- జిమ్‌కు వెళ్లి ఇంటికొచ్చిన కాసేపటికే గుండెపోటు
- ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మృతి
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓచోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.
స్థానిక రామయ్యబౌలికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ అలియాస్ జున్ను (23) రోజులానే గురువారం రాత్రి జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో చాతీలో నొప్పిగా ఉందంటూ వాంతులు చేసుకున్నాడు. అయితే, దానిని గుండెపోటుకు సంకేతంగా భావించని జున్ను ఇంటిముందు వాకింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.