మేనకోడలి పెళ్లికి రూ. 3 కోట్ల బహుమతులు ఇచ్చిన మేనమామలు!
- రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఘటన
- ముగ్గురు అన్నదమ్ములు కలిసి మేనకోడలిపై కనక వర్షం
- ఫిదా అయిపోతున్న జనం
మేనకోడలి పెళ్లంటే మేనమామలదే హడావుడి అంతా. సొంతకుమార్తెను మించి ప్రేమాభిమానాలు కురిపిస్తారు. ఇక ఆమెకు పెళ్లయితే వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ముందుండి వివాహం జరిపిస్తారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా జరిగేది ఇదే. అయితే, ఇంతకుమించి ఆశ్చర్యపరిచే ఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది.
నాగౌర్ జిల్లాలోని బుర్డీ గ్రామానికి చెందిన హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు మేనకోడలిపై కురిపించిన ప్రేమాభిమానాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఆమె పెళ్లికి ఏకంగా రూ. 3.21 కోట్ల విలువైన కట్నకానుకలు సమర్పించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మేనకోడలికి కట్నంగా ఇచ్చిన వాటిలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 30 లక్షల విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, మూడు కేజీల వెండి, ట్రాక్టర్, స్కూటీ, రూ. 80 లక్షల నగదు ఉన్నాయి. ఈ కట్నకానులు చూసిన వారు వారి ప్రేమాభిమానాలకు పులకించిపోయారు.