ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగువాళ్లను చూశాను: ఎన్టీఆర్
- ఘనంగా జరిగిన 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఆస్కార్ అవార్డును గురించి ప్రస్తావించిన ఎన్టీఆర్
- ఆ వేడుకను ప్రత్యక్షంగా చూడటం అదృష్టమని వ్యాఖ్య
- ఆ స్పూర్తితో తెలుగు సినిమా ముందుకు వెళ్లాలని ఆకాంక్ష
విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదారాబాదు - శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని పాటకి దక్కిన 'ఆస్కార్' గురించి ప్రస్తావించారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఈ రోజున ప్రపంచపటంలో నిలవడానికీ .. ఆస్కార్ అవార్డును చేజిక్కించుకోవడానికి .. రాజమౌళి గారు ఎంత కారకులో .. కీరవాణి గారు ఎంత కారకులో .. చంద్రబోస్ గారు ఎంత కారకులో .. మీ అందరి అభిమానం కూడా అంతే కారణం" అన్నారు.
" ఆ అవార్డును సాధించింది మీరే .. మీ అందరి బదులుగా మేము అక్కడికి వెళ్లాము .. మా అందరి బదులుగా కీరవాణిగారు .. బోస్ గారు స్టేజ్ పై నిలుచున్నారు. ఆ స్టేజ్ పైన నాకు కీరవాణి గారు - చంద్రబోస్ గారు కనిపించలేదు .. ఇద్దరు భారతీయులు కనిపించారు .. ఇద్దరు తెలుగువారు కనిపించారు. ఆ స్టేజ్ పై తెలుగుదనం ఉట్టిపడింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
"ఇదంతా కూడా టీవీలో చూస్తూ మీకెలా అనిపించిందో గానీ, రెండు కళ్లతో నేను ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. మళ్లీ అంతటి అనుభూతిని ఎప్పటికి పొందుతామో తెలియదు. 'ఆర్ ఆర్ ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు ఇంకా మున్ముందుకు సాగాలని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.