సౌత్ గ్రూప్ తో సిసోడియా కుమ్మక్కయ్యారు: ఈడీ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ
- ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు, ఫోన్ల వాడకం
- డిజిటల్ ఆధారాలు దొరక్కుండా ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడి
- మార్జిన్ ను 5 నుంచి 12 శాతానికి పెంచారని వివరణ
లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు మరో ఐదు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణలో సిసోడియాకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. సిసోడియా లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ తో కుమ్మక్కయ్యారని, మార్జిన్ ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారని ఈడీ తెలిపింది. డిజిటల్ ఆధారాలు దొరక్కుండా ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు, ఫోన్లు వాడుతున్నారని వివరించింది.