ఇదేం వెబ్ సిరీస్ .. ఇంత దారుణమా?: సీనియర్ నటుడు శివకృష్ణ

  • వెబ్ సిరీస్ లపై స్పందించిన శివకృష్ణ 
  • ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయానని వ్యాఖ్య
  • కచ్చితంగా వాటికి సెన్సార్ ఉండాలన్న శివకృష్ణ 
  • పిల్లలు పాడైపోతున్నారని ఆవేదన   
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో బూతులు .. అభ్యంతరకరమైన సన్నివేశాలు ఎక్కువవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీనియర్ నటుడు శివకృష్ణ స్పందించారు. "నేను సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ తరహా అంశాలపై దృష్టి పెట్టాను. ట్రైలర్స్ మొదలు అనువాద సినిమాల వరకూ సెన్సార్ జరుపుకునేలా చూడాలని లెటర్ కూడా పెట్టాను" అన్నారు. 

"సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్ కి వచ్చిన వారికి మాత్రమే ఆ సంగతి తెలుస్తుంది. వెబ్ సిరీస్ లు అలా కాదే. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాల వల్లనే .. వెబ్ సిరీస్ ల వల్లనే. అందువలన కచ్చితంగా వాటికి సెన్సార్ ఉండాల్సిందే" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"నిన్న నేను ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయాను .. సడెన్ గా అలాంటి ఒక సీన్ వస్తుందని మనం ఊహించలేం కదా. అంత దారుణాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం అనిపించింది. దేశం ఆర్ధికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడడం కష్టం" అని చెప్పుకొచ్చారు.



More Telugu News