ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్ లో మార్చి నెలలో రికార్డు స్థాయి వర్షం
- నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఉదయం వరకు భారీ వర్షం
- నగరంలో 31.7 మి.మీ. వర్షపాతం నమోదు
- 2015 మార్చ్ లో 38.77 మి.మీ. వర్షపాతం నమోదు
హైదరాబాద్ లో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. నగరంలో 31.7 మి.మీ. వర్షపాతం నమోదయింది. మార్చ్ నెలలో ఈ స్థాయిలో వర్షం కురియడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014 మార్చ్ 5న హైదరాబాద్ లో 38.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. 2015 మార్చ్ లో 38.77 మి.మీ. వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.