రెండు పాత్రలను కాదు రెండు సినిమాలు చేసినట్టు అనిపించింది: విష్వక్సేన్

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ'
  • కథానాయికగా అలరించనున్న నివేదా పేతురాజ్
  • తన ఫేవరెట్ సాంగ్ గురించి ప్రస్తావించిన విష్వక్ 
  • ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్ 
విష్వక్సేన్ కి తన కెరియర్ ఆరంభం నుంచే నటనతో పాటు దర్శక నిర్మాతగానూ మంచి అనుభవం ఉంది. తన తాజా చిత్రమైన 'దాస్ కా ధమ్కీ'కి కూడా ఆయనే దర్శక నిర్మాత. 'ఉగాది' పర్వదినం సందర్భంగా ఈ సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్వక్ బిజీ అయ్యాడు. 

తాజా ఇంటర్వ్యూలో విష్వక్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను .. ఇలా చేయడం ఫస్టు టైమ్. రెండు పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందువలన ఒకేసారి రెండు సినిమాలు చేసినట్టుగా అనిపించింది. ఈ ఒక్క సినిమా కోసమే ఏడాదిన్నర పట్టింది. హీరోగా మాత్రమే అయితే ఈ పాటికి 3 సినిమాలు చేసేవాడిని" అన్నాడు. 

"ఈ సినిమా ఫస్టు పార్టులో ఎంత ఎంజాయ్ చేస్తారో .. ఎంత నవ్వుకుంటారో, ఆ తరువాత అంత టెన్షన్ పడతారు. ఈ సినిమాలోని పాటలను చాలా రోజుల ముందుగానే ఒకదాని తరువాత ఒకటిగా వదులుతూ వచ్చాను. 'పడిపోయిందే పిల్లా' అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. నివేదా పేతురాజ్ కథ విన్న తరువాతనే చేయడానికి ఓకే అన్నారు. తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంతవరకూ చూడని ఒక కొత్త నివేదాను ఇప్పుడు చూస్తారు" అని చెప్పుకొచ్చాడు.



More Telugu News