ప్రజాగ్రహం ముందు మనీ పవర్, మజిల్ పవర్ నిలవలేవు: యనమల

  • ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • రెండింట టీడీపీ అధిక్యం
  • ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న యనమల
  • విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర వాసులు కోరుకోవడంలేదని వ్యాఖ్య 
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, రెండింట టీడీపీ ఆధిక్యంలో ఉంది. దాంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 

ప్రజాగ్రహం ముందు మనీ పవర్, మజిల్ పవర్ నిలవలేవని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడడం తప్పు అని యనమల పేర్కొన్నారు. విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడంలేదని అన్నారు. వైసీపీ తీరు చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని వివరించారు. 

అటు, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పైనా యనమల స్పందించారు. అప్పుల గురించి బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోతే ఎలా? అని ప్రశ్నించారు. అప్పు తెచ్చిన నిధులు ఏంచేస్తున్నారో తెలియడంలేదని అన్నారు.


More Telugu News