నష్టాల్లోకి జారుకుని భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లలో జోరు
  • 355 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 114 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూలతలతో ఈ ఉదయం భారీ లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. అయితే మళ్లీ పుంజుకున్న మార్కెట్లు చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడి 57,990కి పెరిగింది. నిఫ్టీ 114 పాయింట్లు పుంజుకుని 17,100 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.53%), నెస్లే ఇండియా (2.32%), టాటా స్టీల్ (1.90%), కోటక్ బ్యాంక్ (1.63%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.51%), మారుతి (-1.48%), ఎన్టీపీసీ (-1.25%), ఏసియన్ పెయింట్స్ (-1.14%), సన్ ఫార్మా (-0.99%).


More Telugu News