పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ఎంపీల నిరసన.. వీడియో ఇదిగో

  • అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలంటూ నిరసన కార్యక్రమం
  • నిరసనల్లో పాల్గొన్న సోనియా, రాహుల్, ఖర్గే
  • డప్పు వాయించిన సంతోష్ కుమార్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంశం పార్లమెంటులో దుమారం రేపుతోంది. అదానీ స్కామ్ లపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఉభయసభల్లో విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ ఎంపీల్లో కే.కేశవరావు, వెంకటేశ్ నేత, సురేశ్ రెడ్డి, సంతోష్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. 

ఇక సంతోష్ కుమార్ డప్పు వాయించగా... ఇతర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనల్లో పాల్గొంది. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పార్లమెంటు ఐదో విడత సమావేశాలు గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ... అదానీ అంశం వల్ల ఒక్క రోజు కూడా సభాకార్యక్రమాలు సజావుగా జరగలేదు.


More Telugu News