టీమిండియాతో తొలి వన్డే... కష్టాల్లో కంగారూలు
- ముంబయిలో భారత్, ఆసీస్ తొలి వన్డే
- టాస్ గెలిచి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించిన భారత్
- 139 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ధాటిగా ఆడిన మిచెల్ మార్ష్
టీమిండియాతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 139 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సిరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ధాటిగా ఆడి భారత శిబిరంలో అలజడి రేపాడు. మార్ష్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. మార్ష్ ను జడేజా అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. అప్పటికి ఆసీస్ స్కోరు 3 వికెట్లకు 129 పరుగులు కాగా, మరికాసేపటికే మార్నస్ లబుషేన్ (15) ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో ఆసీస్ నాలుగో వికెట్ జార్చుకుంది.
ప్రస్తుతం ఆసీస్ స్కోరు 25 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 151 పరుగులు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 12 పరుగులతోనూ, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 6 పరుగులతోనూ ఆడుతున్నారు.