డాక్టర్ సునీత పోరాటం అద్వితీయం: రఘురామ
- అవినాశ్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
- డాక్టర్ సునీతకు హ్యాట్సాఫ్ అంటూ రఘురామ స్పందన
- మరికొన్ని అరెస్ట్ లు ఖాయమని వ్యాఖ్య
- సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని కామెంట్
వివేకా హత్య కేసులో పలు మార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు కొట్టివేతకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ రఘురామరాజు తనదైన శైలిలో స్పందించారు.
అవినాశ్ రెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని, ఈ వ్యవహారంలో డాక్టర్ సునీత పోరాటం అద్వితీయం అని కొనియాడారు. డాక్టర్ సునీత మడమతిప్పని నైజానికి హ్యాట్సాఫ్ అంటూ రఘురామ ట్వీట్ చేశారు.
ఈ కేసులో మరికొన్ని అరెస్ట్ లు ఖాయమని అన్నారు. ఇప్పటికే అరెస్ట్ పై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ లోపు న్యాయవాదులు డబ్బు సంపాదించుకోవడం ఖాయమని, ఎలాగూ కొట్టేస్తారని తెలిసినా, సుప్రీంకోర్టుకు వెళతారని వ్యంగ్యం ప్రదర్శించారు. హైకోర్టు తీర్పు తాలూకు ఆర్డర్ చేతిలో పడగానే, ఈ సాయంత్రం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతాయని రఘురామ అన్నారు.
ఈ కేసులో విచారణ చేయాలని సుప్రీంకోర్టే హైకోర్టుకు చెప్పినప్పుడు, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఏం జరుగుతుందో ఊహించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదేమీ అల్లాటప్పా కేసు కాదని, మర్డర్ కేసు అని, హుటాహుటీన టేకప్ చేయకపోవచ్చని అన్నారు.
ఈ పిటిషన్లు సోమవారం విచారణకు రావొచ్చని, జగన్ కు చెందిన కేసులు వాదించే వాళ్లే దీంట్లోనూ వాదనలు వినిపిస్తారని, చివరికి న్యాయస్థానం ఆ పిటిషన్లు కొట్టేస్తుందని రఘురామ జోస్యం చెప్పారు. ఈ విషయం చెప్పడానికి న్యాయనిపుణుల అంచనా అక్కర్లేదని, తన అంచనా సరిపోతుందని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ త్వరగా జరపాలని సుప్రీం కోర్టు చెబితే, విచారణ ఆపాలంటూ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళాతారా? అంటూ ప్రశ్నించారు.