ఆసీస్ తో తొలి వన్డే... టాస్ గెలిచిన టీమిండియా
- టీమిండియా, ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్
- ముంబయిలో నేడు తొలి వన్డే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 6 ఓవర్లలో 1 వికెట్ కు 33 రన్స్ చేసిన ఆసీస్
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా ప్రారంభమైన ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 13, స్టీవెన్ స్మిత్ 9 పరుగులతో ఆడుతున్నారు. 5 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియాకు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. గిల్, ఇషాన్ కిషన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లోనూ టీమిండియాకు మెరుగైన వనరులు ఉన్నాయి. మహ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా పేస్ తోనూ... జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ తోనూ సేవలు అందించనున్నారు.
అటు ఆసీస్ జట్టులోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ మార్ష్, కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్ అంచనాలకు తగ్గట్టు రాణించాలని ఆసీస్ శిబిరం కోరుకుంటోంది.