త్వరలో జరిగే పరీక్షలపై టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం!
- కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్న టీఎస్ పీఎస్సీ
- పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో మార్పులు
- ప్రశ్నలను ఎంపిక చేసే నిపుణులను కూడా మార్చే అవకాశం
ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జరగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా పేపర్లు సిద్ధం చేయాలని భావిస్తోంది.
నిజానికి టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల కోసం ఇప్పటికే కొన్ని ప్రశ్నపత్రాలు సిద్ధం చేశారు. మరికొన్ని పరీక్షలకు సంబంధించి ప్రశ్నల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేయాలని కమిషన్ నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలు ఎంపిక చేయనుంది.
మరోవైపు ప్రశ్నలను ఎంపిక చేసే నిపుణులను కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. సబ్జెక్ట్ నిపుణులుగా ఎవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటి వివరాలను సాధారణంగా చాలా గోప్యంగా ఉంచుతారు. నిపుణులకు సైతం ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నిపుణులను మార్చే దిశగా కమిషన్ చర్యలు చేపట్టినట్లు సమాచారం.