అమెరికా నుంచి ఢిల్లీకి రామ్ చరణ్.. అభిమానుల ఘన స్వాగతం.. వీడియోలు వైరల్!

  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ సందడి
  • ‘నాటు నాటు’ పాటను దేశ ప్రజలే ఆస్కార్ కు తీసుకెళ్లారన్న ఆర్ఆర్ఆర్ స్టార్
  • నేడు ఢిల్లీలో ఇండియా టుడే కాన్ క్లావ్ కు హాజరుకానున్న చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఆస్కార్ వేడుకల తర్వాత తొలిసారి వచ్చిన ఆయనకు ఎయిర్ పోర్టు వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో రామ్ చరణ్ మాట్లాడారు. 

‘‘మా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసి.. నాటు నాటు పాటను సూపర్ హిట్ చేసిన ప్రతి భారతీయు సినీ ప్రియుడికి, నా అభిమానులకు ధన్యవాదాలు. నాటు నాటు మా ఒక్కరి పాట మాత్రమే కాదు.. మీ అందరి పాట. దేశ ప్రజలే దీన్ని ఆస్కార్ కు తీసుకెళ్లారు’’ అని చరణ్ అన్నారు. 

మరోవైపు అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. హైదరాబాద్ కు కాకుండా ఢిల్లీ వెళ్లడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజు ఢిల్లీలో జరగనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇండియా టుడే కాన్ క్లావ్ కు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.


More Telugu News