ఆస్కార్ అందుకొని హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం
- ఈ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యులు
- ఘన స్వాగతం పలికిన అభిమానులు
- జై హింద్ అంటూ బయటికి వచ్చిన రాజమౌళి
ఆస్కార్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం హైదరాబాద్ కు తిరిగొచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ తదితరులు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. పలువురు కుటుంబ సభ్యులతో వచ్చిన వీరికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. తెల్లవారుజామున కూడా అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఉన్న పలువురు రాజమౌళి, కీరవాణితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
విమానాశ్రయంలో రాజమౌళి మీడియాతో మాట్లాడలేదు. నవ్వుతూ, హుషారుగా కనిపించిన ఆయన జైహింద్ అంటూ వెళ్లిపోయారు. జాతీయ మీడియాతో మాట్లాడిన కాలభైరవ.. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ పాటను లైవ్ లో పాడటం తన జీవితంలోనే గొప్ప క్షణం అన్నారు. ఆస్కార్ అవార్డును అందుకోవడం చిరకాలం గుర్తుండిపోయ సందర్భం అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే.