లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు
  • లాభాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు
  • నష్టాలను చవి చూస్తున్న టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్
  • లాభాలు కళ్ల చూస్తున్న ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.00 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 57,837 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల మేర మెరుగుపడి 17,054 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసల మేరకు పుంజుకుని 82.54 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. లాభాలబాటలో ఉన్న షేర్లలో ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్ ముందంజలో ఉన్నాయి. 

ఇక అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునే దిశగా అమెరికాలోని పలు ప్రధాన బ్యాంకులు నిధులు సమకూర్చేందుకు ముందుకు రావడం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఇక సిలికాన్ వ్యాలీ బ్యాంకు వైఫల్యం తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు 160 బిలియన్ డాలర్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసేందుకు అమెరికాలోని ప్రధాన బ్యాంకులు యోచిస్తున్నాయి.


More Telugu News