దక్షిణ మధ్య రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
- విజయవాడ మధురానగర్ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం
- ఆలస్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్
- విచారణకు రావాలంటూ జీఎం, డీఆర్ఎంలకు ఆదేశాలు
- గైర్హాజరైన అధికారులు
విజయవాడ మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం, డీఆర్ఎం విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణం.
ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం నుంచి తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. డీఆర్ఎం స్థాయి అధికారిని కూడా విచారణకు రప్పించలేకపోతే హైకోర్టు ఎందుకు? కోర్టులు అంటే అంత లెక్కలేదా? విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి? అంటూ మండిపడింది. అవతల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.