ఆలిస్ ఇన్ వండర్ లాండ్... సినిమా కాదు సిండ్రోమ్!
- హాలీవుడ్ సినిమా పేరుతో సిండ్రోమ్
- కంటిచూపుకు మెదడుతో సమన్వయం లేక భ్రాంతులు
- వినికిడి దోషాలు కూడా ఏర్పడతాయంటున్న వైద్యులు
- నిర్దిష్ట చికిత్స లేని సిండ్రోమ్
- లక్షణాల వారీగా చికిత్స
హాలీవుడ్ చిత్రం ఆలిస్ ఇన్ వండర్ లాండ్ చూస్తే... అందులో హీరోయిన్ ఒకసారి భారీగా కనిపిస్తే, ఒకసారి సూక్ష్మ రూపంలో కనిపిస్తుంది. కొన్ని పాత్రలు పెద్దవిగా, మరికొన్ని బుల్లి రూపాల్లో కనిపిస్తాయి. అయితే అది సినిమా. ఇప్పుడదే పేరుతో ఓ సిండ్రోమ్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆలిస్ ఇన్ వండర్ లాండ్ సిండ్రోమ్ లక్షణాలు ఎలాంటివో చర్చించే ముందే, 9 ఏళ్ల జోష్ ఫర్త్ అనే చిన్నారి గురించి చెప్పాలి. జోష్ ఓసారి తల్లిదండ్రులతో కారులో వెళుతుండగా, రోడ్డు పక్కనే ఉన్న భవనాలు భారీగా పెరిగిపోతున్నట్టు కనిపించాయి. దాంతో తల్లికి ఆ విషయాన్ని చెప్పగా, ఆమె ఆశ్చర్యపోయింది. ఓసారి జోష్ స్కూల్లో చెస్ ఆడుతుండగా, తన వేళ్లు విశాలంగా మారిపోతున్నట్టు, చెస్ బోర్డుపై ఉన్న పావులను చేతివేళ్లతో పట్టుకోలేకపోతున్నట్టు విచిత్రమైన ఫీలింగ్ కు లోనయ్యాడు.
ఇలాంటివే అనేక విస్మయకర అనుభూతులకు గురయ్యాడు. చిన్నారి జోష్ సమస్య ఏంటన్నది గుర్తించడానికి తల్లిదండ్రులకు, వైద్యులకు రెండేళ్లు పట్టింది. ఆ బాలుడు అత్యంత అరుదైన రుగ్మతతో బాధపడుతున్నాడని, అదే ఆలిస్ ఇన్ వండర్ లాండ్ సిండ్రోమ్ అని వెల్లడైంది.
ఈ సిండ్రోమ్ కు గురైన వారిలో కంటి చూపు, వినికిడి శక్తి మందగిస్తాయి. ఎదుటి వ్యక్తుల శరీర భాగాలు అతికించినట్టుగా, ముఖానికి చేయి అతుక్కున్నట్టుగా కనిపిస్తాయి. అంతేకాదు, ఎదుటి వ్యక్తులు స్లో మోషన్ లో నడుస్తున్నట్టుగా, ఒక్కోసారి వేగంగా వెళుతున్నట్టుగా భ్రాంతికి లోనవుతారు. ఇతరుల మాటలు కూడా అత్యంత నిదానంగా, లేక వేగంగా గజిబిజిగా వినిపిస్తుంటాయి.
ఆలిస్ ఇన్ వండర్ లాండ్ సిండ్రోమ్ ఎందుకు ఏర్పడుతుందన్నది ఇంతవరకు నిర్దిష్టంగా గుర్తించలేకపోయారు. అయితే, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్లు, అంతర్గత రక్తస్రావం, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూర్ఛ, మైగ్రేన్, కంటి జబ్బులు, డిప్రెషన్, స్కిజోఫ్రినియా వంటి సమస్యల కారణంగా ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. ఇవేకాదు, లైమ్ డిసీజ్, హెచ్1ఎన్1 ఇన్ ఫ్లుయెంజా, కాక్సాకీ వైరస్ బీ1 వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆలిస్ ఇన్ వండర్ లాండ్ సిండ్రోమ్ కు గురయ్యే అవకాశాలున్నట్టు కొందరు వైద్య నిపుణుల అంచనా.
ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నవారిలో మెదడులోని టెంపోరో పేరియటల్ ఆక్సిపిటల్ జంక్షన్ అస్తవ్యస్తంగా మారుతుంది. మనిషి శరీర స్థితి, స్పర్శ, నొప్పి, గాయాలు, వాపులు, నరాలకు సంబంధించిన సమస్యల తాలూకు సంకేతాలు ఈ జంక్షన్ లోనే దృశ్య, ప్రాదేశిక సమాచారంతో సమన్వయం కుదుర్చుకుంటాయి. ఈ సమన్వయం దెబ్బతిన్నప్పుడు చూసేవాటిలోనూ, వినే విషయాల్లోనూ అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి.
కాగా, ఇంగ్లండ్ కు చెందిన గిలియన్ హారిస్ అనే మహిళ ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్టు ఆమె 48వ ఏట గుర్తించారు. ఆమె చిన్నతనం నుంచి ఈ లక్షణాలతో బాధపడుతున్నా, నిర్ధారణకు ఇన్నాళ్ల సమయం పట్టిందట.
దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీలేదు. రోగి మానసిక, శారీరక స్థితిని బట్టి సౌకర్యంగా ఉంచడం ప్రధానం. అంటే, లక్షణాల ఆధారంగా వైద్యం చేయడం తప్ప, స్థూలంగా ఈ సిండ్రోమ్ ను కట్టడి చేసే ఔషధాలు లేవు.