కేటీఆర్ ను పదవి నుంచి తప్పించాలి: బండి సంజయ్
- టీఎస్ పీఎస్సీ పశ్నాపత్రం లీకేజ్ పై బండి సంజయ్ మండిపాటు
- జైల్లో ఉన్న బీజేవైఎం కార్యకర్తలకు పరామర్శ
- ఐటీ శాఖ విఫలమయిందని విమర్శ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... పేపర్ లీక్ విషయంలో కమిషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లీకేజ్ కు కారణమైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఈరోజు సంజయ్ పరామర్శించారు.
అనంతరం జైలు ఎదుట మీడియాతో మాట్లాడుతూ, ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్ వర్డ్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ విషయంలో ఐటీ శాఖ విఫలమయిందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.