సరికొత్త ఐఫోన్ 15 ప్రో గురించి కీలక విషయాల లీక్
- ఈ ఏడాది చివర్లో రానున్న కొత్త మోడల్
- సరికొత్త ఫీచర్లు, అప్డేట్స్ తో అందుబాటులోకి
- ధర కూడా భారీగా పెరుగుతుందంటున్న టెక్ నిపుణులు
ఐఫోన్ 15 సిరీస్ మోడల్ ఫోన్లు ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానున్నాయి. ఫీచర్లలో కీలక అప్‌గ్రేడ్‌లతో రాబోయే ఈ ప్రీమియం ఫోన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ కొత్త సాలిడ్-స్టేట్ బటన్ డిజైన్‌తో రానున్నాయి. ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ మోడల్స్ ధరలు అధికంగా ఉంటాయని టెక్ నిపుణులు జెఫ్ పు తెలిపారు. స్టాండర్డ్ మోడల్ సైతం కెమెరా, డిజైన్, ఇతర ఫీచర్లలో కీలక మార్పులతో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇప్పటివరకూ లీక్ అయిన వివరాల ప్రకారం ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లో మెరుగైన ఆప్టికల్ జూమ్ కోసం యాపిల్ కొత్త పెరిస్కోప్ లెన్స్ వాడుతుందని సమాచారం.
అలాగే, ఖరీదైన ప్రొ వేరియంట్లు మెరుగైన ర్యామ్, టైటానియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫోన్లలో యాపిల్ అధునాత ఏ17 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనుంది. ఈ ఫీచర్లు, అప్‌డేట్ల కారణంగా రాబోయే ఐఫోన్ల ధరలు అధికంగా ఉండనున్నాయి. పాత మోడల్‌తో పోల్చితే యాపిల్ ఐఫోన్ 15 ఆల్ట్రా ధరను 200 డాలర్ల వరకు పెంచుతారని తెలుస్తోంది. వీటి ధర 1,299 డాలర్లుగా ఉంటుందని, భారత కరెన్సీలో రూ. 1,07,330 సమాచారం. భారత మార్కెట్‌లోకి వచ్చేసరికి కస్టమ్స్, ఇతర పన్నులు కలుపుకొని ధర మరింత పెరగనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ భారత్ లో రూ. 1,39,900 ధరతో ప్రారంభమైంది. ఈ లెక్కన ఐఫోన్ 15 ఆల్ట్రా కనీసం లక్షన్నర ధరతో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.