దేశానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు: రాహుల్ గాంధీ
- ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరైన రాహుల్
- భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై దుమారం
- తనకు అవకాశం ఇస్తే దీనిపై పార్లమెంటులో మాట్లాడతానన్న కాంగ్రెస్ నేత
విదేశీ పర్యటన సందర్భంగా భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై పార్లమెంటు దద్దరిల్లుతోంది. రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ డిమాండ్ చేస్తోంది. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అదానీ అంశాన్ని దాటవేసేందుకే ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతిస్తే పార్లమెంటులో మాట్లాడతానని చెప్పారు. అక్కడ అవకాశం ఇవ్వకపోతే పార్లమెంటు బయట మాట్లాడతానని తెలిపారు. కాగా, ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.