ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ

  • చర్చనీయాంశంగా నోబెల్ కమిటీ డిప్యూటీ నేత వ్యాఖ్యలు
  • నోబెల్ శాంతి బహుమతికి మోదీనే ప్రధాన పోటీదారు అన్న ఆష్లే టోజే
  • ప్రపంచ శాంతికి అత్యంత విశ్వసనీయ వ్యక్తి మోదీ అని కితాబు
  • ప్రపంచ నేతలు మోదీలా ఉండాలని వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీని ఈ ఏడాది ప్రపంచ ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డు వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి రేసులో మోదీ ముందంజలో ఉన్నారు. ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీనే అతి పెద్ద పోటీదారు అని నోబెల్ కమిటీ డిప్యూటీ నేత ఆష్లే టోజే వెల్లడించారు. 

ప్రపంచంలో శాంతికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి మోదీనేనని ఆష్లే టోజే అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపగల సమర్థత మోదీకే ఉందని అభిప్రాయపడ్డారు. మోదీ పనితీరుకు అభిమానినయ్యానంటూ టోజే పేర్కొన్నారు. భారత్ సంపన్న, శక్తిమంతమైన దేశంగా అవతరిస్తోంది అని వివరించారు. ప్రపంచ నేతలు మోదీలా ఉండాలని అభిలషించారు.

ఆష్లే టోజే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబరు మాసంలో నోబెల్ అవార్డులు ప్రకటించనున్నారు.


More Telugu News