శివ లింగానికి జలాభిషేకం చేసిన ముఫ్తీ.. వీడియో ఇదిగో!

  • భారత సరిహద్దుల్లోని ఆలయాన్ని సందర్శించిన ముఫ్తీ
  • నవగ్రహ ఆలయంలో పార్టీ నేతలతో కలిసి పూజలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • రాజకీయ గిమ్మిక్కంటూ బీజేపీ నేతల విమర్శలు
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ హిందూ ఆలయంలో పూజలు చేశారు. పూంచ్ జిల్లాలో పర్యటిస్తున్న ముఫ్తీ.. సరిహద్దుల్లోని నవగ్రహ ఆలయానికి వెళ్లారు. ఈ ఆలయం నిర్మించిన యశ్ పాల్ శర్మ విగ్రహానికి పూలమాల సమర్పించారు. ఆలయంలోని శివలింగానికి జలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఫ్తీ ఆలయ సందర్శనపై జమ్మూకశ్మీర్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 2008లో అమర్ నాథ్ బోర్డుకు భూమి కేటాయింపులను ముఫ్తీతో పాటు ఆమె పార్టీ నేతలంతా అడ్డుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రణబీర్ సింగ్ పఠానియా తెలిపారు. అలాంటి నేతలు ఇప్పుడు రాజకీయంగా లబ్ది పొందాలని శివాలయం సందర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News