సెకండరీ విద్యకు భారీ కేటాయింపులు... ఏపీ బడ్జెట్ హైలైట్స్ - 2
- వెనుకబడిన తరగతుల సంక్షేమానికి - రూ. 38,605 కోట్లు
- కాపు సంక్షేమానికి - రూ. 4,887 కోట్లు
- సెకండరీ విద్యకు - రూ. 29,690 కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమానికే బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బడ్జెట్ హైలైట్స్:
బడ్జెట్ హైలైట్స్:
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి - రూ. 15,873 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధికి - రూ. 9,381 కోట్లు
- మనబడి నాడు నేడు - రూ. 3,500 కోట్లు
- జగనన్న విద్యాకానుక - రూ. 560 కోట్లు
- యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖకు - రూ. 1,291 కోట్లు
- కాపు సంక్షేమానికి - రూ. 4,887 కోట్లు
- మైనార్టీల సంక్షేమానికి - రూ. 4,203 కోట్లు
- వెనుకబడిన తరగతుల సంక్షేమానికి - రూ. 38,605 కోట్లు
- షెడ్యూల్ తెగల సంక్షేమానికి - రూ. 6,929 కోట్లు
- షెడ్యూల్ కులాల సంక్షేమానికి - రూ. 20,005 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు - రూ. 9,118 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం - రూ. 2,602 కోట్లు
- పేదలందరికీ ఇళ్లు - రూ. 5,600 కోట్లు
- గ్రామ, వార్డు సచివాలయ శాఖకు - రూ. 3,858 కోట్లు
- గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి - రూ. 532 కోట్లు
- విద్యుత్ శాఖకు - రూ. 6,456 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖకు - రూ. 15,882 కోట్లు
- సెకండరీ విద్యకు - రూ. 29,690 కోట్లు
- వ్యవసాయ రంగానికి - రూ. 11,589 కోట్లు
- క్రిస్టియన్ కార్పొరేషన్ కు - రూ. 115.03 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు - రూ. 1,787 కోట్లు
- సివిల్ సప్లైస్ శాఖకు - రూ. 3,725 కోట్లు
- న్యాయ శాఖకు - రూ. 1,058 కోట్లు
- ఐటీ శాఖకు - రూ. 215 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు - రూ. 3,951 కోట్లు
- స్కిల్ డెవలప్ మెంట్ కు - రూ. 1,166 కోట్లు.