నా మనసులో ఎప్పుడూ అదే ఆలోచన ఉండేది: సీనియర్ నటి జయచిత్ర
- హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జయచిత్ర
- కేరక్టర్ ఆర్టిస్టుగాను ప్రత్యేకమైన గుర్తింపు
- తన అంకితభావమే తనని నిలబెట్టిందని వెల్లడి
- డబ్బు గురించి పెద్దగా ఆలోచన చేయలేదని వ్యాఖ్య
1975 ద్వితీయార్థంలో తెలుగు తెరకి వచ్చిన కథానాయికలలో జయచిత్ర ఒకరు. అప్పట్లోనే ఆమె మోడ్రన్ గా కనిపించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. ఆ తరువాత తరం హీరోలకు తల్లి పాత్రలలోను ఆమె మెప్పించారు. అహంభావంతో కూడిన శ్రీమంతురాలి పాత్రలు చేయడంలో ఆమె తరువాతనే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ఐ డ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయచిత్ర మాట్లాడుతూ .. "తమిళంలో బాలచందర్ గారు .. తెలుగులో బాపయ్య .. దాసరి .. రాఘవేంద్రరావు గారు నాకు గుర్తుండిపోయే సినిమాలను ఇచ్చారు. ఆ సినిమాలన్నీ కూడా నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. ఆ సమయంలో నాకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. డబ్బు అదే వస్తుంది .. అనుకుని సినిమాలు చేస్తూ వెళ్లిపోయేదానిని" అని చెప్పుకొచ్చారు.
"మొదట్లో షూటింగు చూసుకుని ఇంటికి వెళ్లిపోయేదానిని. కానీ హీరోయిన్ గా ఎప్పుడైతే ఫస్టు హిట్ పడిందో, అప్పటి నుంచి నేను నెంబర్ వన్ హీరోయిన్ కావాలనే ఒక పట్టుదల ఉండేది. అలా నేను కష్టపడి స్టార్ డమ్ తెచ్చుకున్నాను. ఎప్పుడూ నా పని గురించే నేను ఆలోచిస్తూ ఉండటం వలన, ఫ్రెండ్స్ తో కలిసి గడిపిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. నా కో స్టార్స్ అంతా చాలా మంచి వారు .. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు" అని అన్నారు.