దేశంలో అత్యధిక వృద్ధి రేటు ఏపీదే.. సుపరిపాలన కారణంగానే దీన్ని సాధించగలిగాం!: సీఎం జగన్

  • 45 నెలల పాలనలో సమూల మార్పు వచ్చిందన్న జగన్
  • మేనిఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చామని వ్యాఖ్య
  • కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని వెల్లడి
వైసీపీ ప్రభుత్వ 45 నెలల పాలనలో రాష్ట్రంలో సమూల మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి దాన్ని అమలు చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచి మార్పును తీసుకొచ్చామని అన్నారు. కుల, మతాల రాజకీయాలకు తావు ఇవ్వకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని అన్నారు. అందరూ నా వాళ్లే అనే విధంగా పాలనను అందించామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. 

గతంలో బడ్జెట్ అంటే ఎవరికీ అర్థం కాని విధంగా ఉండేదని... ఇప్పుడు ప్రతి మనిషికీ, ప్రతి గడపకూ వివరాలను అందించగలుగుతున్నామని జగన్ అన్నారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 600 పౌరసేవలను అందించగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఏపీ అని చెప్పారు. సుపరిపాలన కారణంగానే దీన్ని సాధించగలిగామని అన్నారు. రూ. 1.97 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి వేశామని చెప్పారు.


More Telugu News