పాత లిక్కర్ పాలసీని పొడిగించిన ఢిల్లీ ప్రభుత్వం
- 2021-22 ఎక్సైజ్ పాలసీని గత ఏడాది ఆగస్టులో రద్దు చేసిన ఆప్ సర్కారు
- పాత పాలసీని మరో 6 నెలలు పొడిగించాలని తాజాగా నిర్ణయం
- వీలైనంత త్వరగా కొత్త పాలసీని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగించింది. వీలైనంత త్వరగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అప్పటిదాకా పాత పాలసీని కొనసాగించనుంది. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్ ఉల్-ఫితర్, ఈద్ ఉల్-జుహా పండుగలు ఉన్న రోజుల్ని డ్రై డేలుగా ప్రకటించింది. ఈ 5 రోజుల్లో లిక్కర్ అమ్మకాన్ని నిషేధించింది.
ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని గత ఏడాది ఆగస్టు 31న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీ అమలు విషయంలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపణలు చేయడం.. సీబీఐ విచారణ చేయడంతో కొత్త పాలసీని రద్దు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిదాకా 10 మందికిపైగా అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఒకసారి విచారించింది. రేపు మరోసారి విచారించనుంది.