ధరణి పోర్టల్ ను సరిదిద్దేందుకు కొత్త సాఫ్ట్ వేర్

  • కసరత్తు మొదలు పెట్టిన సీసీఎల్ఏ అధికారులు
  • వారంలోపే మార్పులు.. సమస్యలకు చెక్
  • చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఏర్పాట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న సమస్యలకు అధికారులు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఇందులో చిన్న చిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు సీసీఎల్ఏ అధికారులు వెల్లడించారు. సాఫ్ట్ వేర్ లో మార్పులు వారంలోపే పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకొస్తామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 

భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుమానాల నివృత్తికి పోర్టల్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నవీన్ మిట్టల్ వివరించారు. తరచుగా అడిగే ప్రశ్నలకు వెంటనే జవాబులు అందించేలా ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ టెక్నాలజీని ధరణి పోర్టల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా రైతులు తమ సమస్యను సులభంగా గుర్తించి, వాటికి ఏంచేయాలనేది కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం ఎవరిని కలవాలి, గతంలో చూపిన పరిష్కారం వంటి వివరాలను రైతులు పొందవచ్చని పేర్కొన్నారు.


More Telugu News